Grama Sabhalu: రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఇవాళ ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె రాష్ట్రస్థాయి గ్రామసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
’’గత ప్రభుత్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారు. అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారు. భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని సంయుక్త సర్పంచ్ గా నిలబడి గెలిచారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగింది. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్దే కూటమి లక్ష్యం.
ఉన్న నిధులను కూడా దారిమళ్లించిన పరిస్థితి గతంలో చూశాం. గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయతీలు చాలా కీలకం. దేశభక్తి పంచాయతీల నుంచి రావాలి. గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యం. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్ తో ముందుకెళ్తున్నాం.
అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటాం. బాధ్యతల నుంచి మేం పారిపోము.. నిరంతరం పనిచేస్తాం. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు.. గుండెల నిండా నిబద్ధత ఉంది. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని నేను వదలుకోను. మనుషులను కలుపుకొనే వ్యక్తిని నేను. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యం. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం.
వైయస్ఆర్సీపీ హయాంలో పంచాయతీలకు కేటాయించిన నిధులు ఏమైపోయాయో తెలియదు. 75శాతం గ్రామాల్లో వైయస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్ లు ఉన్నారు. చంద్రబాబు దగ్గర పరిపాలన స్కిల్స్ నేర్చుకోవడాన్ని.. నేను తక్కువగా చూడను. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని నేను చాలా సభల్లో చెప్పా. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే. లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారు. నాకంటే బాగా ఆలోచించగలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను.
పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది. ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధం. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటా.. అండగా ఉంటా. పదవి నాకు అలంకారం కాదు.. బాధ్యతగా ఉంటా.. నేనెప్పుడు పనిచేసేందుకే సిద్ధంగా ఉంటా. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తాం. గ్రామాల్లో కళాశాలలు, క్రీడా మైదానాలు కూడా లేని పరిస్థితి.
ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రభుత్వపరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే. దాతలు ముందుకొస్తే.. నేను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తాం. రాయలసీమలోనే ఉపాధి అవకాశాలు పెంచుతాం. వలసలు ఆగడానికి స్కిల్ డెవలప్ మెంట్ వర్సిటీ తీసుకొస్తాం.
15వ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది.. మేము వచ్చి రూ.998 కోట్లు రాత్రికి ప్రతి అకౌంట్ లో పడేలా చేసేమంటే.. మీరు బలం ఇస్తే చేయగలిగాం.. అది మీ మహిళల శక్తి.. 70శాతం మంది వైయస్ఆర్సీపీ సర్పంచ్ లే.. వారిని అడగండి డబ్బులు పడ్డాయి.. అందుకే గ్రామసభలు పెడుతున్నాం. ఆ ధైర్యం సమాజానికి యువత, మహిళలు ఇచ్చారు.. మహిళలు, యువతే దేశానికి వెన్నెముక. వచ్చే తరం నాయకులు రావడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు.’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Pawan Kalyan: మా సంగతి కాస్త చూడండి.. పవన్‌కు మద్యం షాపుల్లో పని చేస్తున్న యువకుల వినతి
Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..
Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?
Voting: మీ ఓటును ఎవరో వేసేశారా? ఏం చేయాలంటే..