CM Revanth with Modi: తెలంగాణకు రావలసిన నిధులు, బొగ్గుగనులు, విభజన చట్టంలోని హామీలు, రక్షణ భూముల బదలాయింపు వంటి 12 కీలకమైన అంశాలను సత్వరం పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో బలోపేతం చేయడంతో పాటు పునర్విభజన చట్టం మేరకు ధీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన జారీ చేసింది.
* కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో చేర్చిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకును అందులోంచి తొలగించి సింగరేణికి కేటాయించాలి.
* గోదావరి లోయ ప్రాంతంలోని బొగ్గు నిల్వల క్షేత్రంగా సింగరేణి గుర్తించిన ప్రాంతంలోని కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను కూడా చట్ట ప్రకారం సింగరేణికి కేటాయించాలి.
* ప్రతి రాష్ట్రంలో ఒక IIM ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమైనప్పటికీ తెలంగాణకు ఇంతవరకు మంజూరు కాలేదు. తక్షణం దాన్ని మంజూరు చేయాలి.
* 2010లో హైదరాబాద్‌కు మంజూరు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టును పునరుద్ధరించాలి.
* రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి.
* సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలి
* గతంలో తక్కువ ఇండ్లు కేటాయించిన కారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలి.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 2019 నుంచి ఇప్పటివరకు రావలసిన రూ.1,800 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
* హైదరాబాద్ నగరంలో ప్రతిపాదించిన హైదరాబాద్- కరీంనగర్, హైదరాబాద్ – నాగ్‌పూర్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లతో పాటు నగరంలో రోడ్ల విస్తరణకు అవసరమైన 2450 ఎకరాల మేరకు రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలి.
* రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి.
* భారత్‌మాల పరియోజన పథకం కింద సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు రాష్ట్ర వాటాగా అవసరమైన 50 శాతం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. అలాగే రెండో భాగం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆమోదముద్ర వేయాలి.
* తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి.
* కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలి.
* నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి.
* డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణతో పాటు అరికట్టడానికి కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం నిధులు మంజూరు చేయాలి.
* రాష్ట్రానికి అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి.
Read also: Cinema Producers: ఏపీ ఉపముఖ్యమంత్రితో సినిమా పెద్దల భేటీ
Pawan Kalyan: అసెంబ్లీలో చర్చలు ప్రజల మనోభావాలను ప్రతిఫలించాలి
Pawan Kalyan: పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందే
Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు