HomeసినిమాVijay: విజయ్‌ ‘గోట్‌’కు ‘అవతార్‌’ ఎక్స్‌పర్టుల విజువల్స్‌!

Vijay: విజయ్‌ ‘గోట్‌’కు ‘అవతార్‌’ ఎక్స్‌పర్టుల విజువల్స్‌!

Vijay: తమిళ అగ్ర హీరో విజయ్‌ (Vijay) హీరోగా నటిస్తున్న చిత్రం గోట్. బిగ్ బడ్జెట్‌తో, అత్యంత భారీ అంచనాలతో ఈ చిత్రం ముస్తాబు అవుతోంది. వెంకట్‌ ప్రభు గోట్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

అవతార్‌, అవెంజర్స్‌ వంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చిన సాంకేతిక నిపుణులు గోట్‌ మూవీకి కూడా పని చేయనున్నారట. ఈ విషయాన్ని క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చనా కళ్పతి సోషల్‌ మీడియా వేదికల ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

కథానాయకుడు విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వినియోగించి పాతికేళ్ల కుర్రాడిగా చూపాల్సి వచ్చిందట. ఈ నేపథ్యంలో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులకు ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ అప్పగించినట్లు తెలుస్తోంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 5వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇవీ చదవండి: GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్‌ రియాక్షన్‌ ఇదీ..!
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
SSMB 29: గాసిప్స్‌కు చెక్‌ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్‌.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత
Salaar2: సలార్‌ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్‌ విలన్‌గా మలయాళ నటుడు!
Prabhas: ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News