Vijay Devarakonda: అర్జున్‌రెడ్డి మూవీతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నాలుగు హిట్ సినిమాలను వదులుకున్నాడట. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ‘ఫ్యామిలీస్టార్’ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ప్రతీ నటుడి దగ్గరకు కొన్ని కథలు వస్తుంటాయి. కానీ అన్నింటినీ అందరూ చేయలేరు. ఇదే కోవలో విజయ్ దగ్గరకు ఓ నాలుగు స్టోరీలు వచ్చాయి. వివిధ కారణాల వల్ల వాటిని ఆయన చేయలేకపోయాడట. వేరే హీరోలతో చేసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ హిట్ అయ్యాయి.
1. ‘భీష్మ’ (Bheeshma)
విజయ్ దగ్గరకు వచ్చిన కథల్లో ఈ మూవీ ఒకటి. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్, రష్మిక కలిసి నటించారు. ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా అలరించింది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ కథను తొలుత విజయ్ దేవరకొండకు చెప్పారు. అయితే, అనివార్య కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. తర్వాత ఈ సినిమా నిత్ కెరీర్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది.
2. ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన మూవీ ఇది. పూరీ, రామ్ కెరీర్‌లో మంచి మైలురాయిగా నిలిచింది. మొదట ఈ ఈ కథను విజయ్‌కు పూరీ చెప్పాడట. కానీ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో విజయ్‌కు కాస్త సందేహాలు ఉండి సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదట. దీంతో కథ రామ్ వద్దకు వెళ్లింది. తన ఎనర్జీని పెంచి ‘ఇస్మార్ట్ శంకర్’గా అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోన్న సంగతి తెలిసిందే. అనంతరం పూరి-విజయ్ కాంబోలో వచ్చిన ‘లైగర్’ నిరాశపరిచింది.
3. ఆర్‌ఎక్స్ 100 (RX100)
అజయ్ భూపతి డైరెక్టర్‌గా కార్తికేయ గుమ్మకొండ హీరోగా వచ్చిన చిత్రం ఇది. యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ యూత్ రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కార్తికేయకు కెరీర్ బ్రేక్‌ను అందించింది. తొలుత ఈ మూవీని డైరెక్టర్ అజయ్ పలువురు హీరోలకు వినిపించారు. శర్వానంద్‌కు కథ చెప్పగా, రొమాంటిక్ సీన్లు మరీ ఎక్కువ ఉన్నాయని వద్దనున్నారట. ఇక విజయ్ దేవరకొండకు కూడా కథను వినిపించగా అప్పటికే తాను చేసిన ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగానే ఉంటుందనే అనుమానంతో వద్దన్నారట.
4. ఉప్పెన (Uppena)
దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా 2021లో వచ్చింది. యువతలో మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జోడీ నటనకు ఫిదా అయ్యారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ కట్టిపడేసింది. ఈ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండేనట. బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా ఉండగానే విజయ్‌ని దృష్టిలోపెట్టుకుని కథను డెవలప్ చేశారు. కానీ అర్జున్‌రెడ్డి విడుదలైన తర్వాత విజయ్ రేంజ్ మారిపోవడంతో కథ ఆయనకు సూట్ కాదనుకున్నారట.
ఇవీ చదవండి: Tirumala Hills: తిరుమల 7 కొండలు ఎక్కడం వల్ల శ్రీవారి కృప ఇలా కలుగుతుంది..
[…] ఇవీ చదవండి: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హ… […]
[…] చదవండి: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హ… Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ వీడియో వైరల్.. […]
[…] చదవండి: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హ… Anupama Parameswaran: బ్లూ చీరలో అనుపమ తళతళ.. చీర ధర […]