GV Prakash Kumar: ఇటీవల కోలీవుడ్ జంట జీవీ ప్రకాశ్ కుమార్, ఆయన భార్య సైంధవి విడిపోయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ నటుడైన ఈయన, ప్రముఖ సింగర్ అయిన సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటన రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిపై ట్రోలింగ్ జరిగింది. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని వీరిద్దరూ కోరారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరారు. అభిమానులను ఈ మేరకు వేడుకున్నారు.
కానీ సోషల్ మీడియాలో వీరిద్దరిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా తమపై వస్తున్న ట్రోలింగ్‌కు జీవీ ప్రకాశ్ స్పందించారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం సరైంది కాదన్నారు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఎలా పడితే అలా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇవి తమను చాలా ఇబ్బంది పెడుతున్నాయన్నారు.
ఇతరుల వ్యక్తిగత లైఫ్‌లోకి ప్రవేశించడం, వారి గురించి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తుల జీవితాలపై బాగా ప్రభావం చూపుతాయని గుర్తించాలన్నారు. ఇది గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా? అంటూ జీవీ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాశారు.
తాము విడిపోవడానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలిపామన్నారు. అన్నీ ఆలోచించి, పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ ఉద్దేశంతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ చాలా బాధపెడుతున్నాయన్నారు. అంది చెప్పడానికే ఇంత సుదీర్ఘపోస్టు పెడుతున్నానన్నారు. దయచేసి అందరి భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలని కోరారు. తకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి తాజాగా గుడ్ బై చెప్పి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!
Kiara Advani: బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారాకు అరుదైన అవకాశం
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో రెమ్యునరేషన్?
Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ డేకు మాంచి ట్రీట్
[…] […]
[…] […]
[…] […]