HomeసినిమాSSMB 29: గాసిప్స్‌కు చెక్‌ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్‌.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత

SSMB 29: గాసిప్స్‌కు చెక్‌ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్‌.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత

SSMB 29: దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో అగ్ర హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) నటిస్తున్న చిత్రం SSMB29. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడు మొదలు పెడతారో అంటూ మహేష్‌బాబు, అటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్‌ గురించి ఇంట్రస్టింగ్ కబురు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నిర్మాణ సంస్థ స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన వెలువరించింది.

రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటుల ఎంపికపై పలు రకాల వార్తలు వెలువడుతున్నాయని శ్రీదుర్గ ఆర్ట్స్‌ తెలిపింది. కొన్ని ఇంగ్లీషు వెబ్‌సైట్స్‌లో వెలువడిన కథనాలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. కాస్టింగ్‌ డైరెక్టర్‌ వీరేన్‌ స్వామి సినిమాలో భాగమైనట్లు కొన్ని సైట్లలో రాశారని, అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా తామే స్వయంగా ఇస్తామంది. ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే అధికారిక ప్రకటనను మాత్రమే నమ్మాలని, మరే ఇతర గాసిప్పులను ఆడియన్స్‌ నమ్మవద్దని శ్రీ దుర్గ ఆర్ట్స్‌ ప్రకటించింది.

SSMB29 ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే పేరును ఖాయం చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ప్రిన్స్ మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అవుతున్నారు. తన లుక్‌ను పూర్తిగా మార్చారు.

ఇవీ చదవండి: Prabhas: ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్‌ రియాక్షన్‌ ఇదీ..!
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Kiara Advani: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారాకు అరుదైన అవకాశం

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News