Gangs of Godavari: యువ కథానాయకుడు విష్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. డీజే టిల్లులో రాధిక అక్కగా మోస్ట్ పాపులర్ అయిన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వచ్చింది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కానుకలు వెదజల్లుతోంది. తొలి రోజే రూ.5.2 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. రూ.8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక సెకండ్ డే కూడా అంతే రోజు లేకపోయినా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దూకుడుగానే కలెక్షన్లు సాధించింది. రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే రూ.8.2 కోట్ల నికర కలెక్షన్స్ వచ్చి.. రూ.11.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లయింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసే చాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం థియేటర్లలో శనివారం 25.89 శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అంజలి కీ రోల్ పోషించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: Gangs Of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ.. విష్వక్‌సేన్ మెరిపించాడా?
Indian 2: ప్రతి సీనూ అద్భుతం.. అభిమానులకు పండగే: దర్శకుడు శంకర్
Telangana: 2024-25 తెలంగాణ విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
Hari Hara Veera Mallu: ఈ ఏడాది ఆఖరుకల్లా హరిహర వీరమల్లు విడుదలకు సన్నాహాలు!