Pushpa 2 The Rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరం చూశాం. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ చిత్రం ఈ ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే పుష్ప 2 సినిమా క్లైమాక్స్ చేంజ్ చేస్తున్నారన్నది.
ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడినా.. ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్ 15న బొమ్మ పడుతుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. ఇదే సమయంలో క్లైమాక్స్ చేంజ్ చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మామూలుగానే డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాకూ రెండు క్లైమాక్స్‌లు కసరత్తు చేస్తాడని టాక్. ఇలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు రెడీ చేశారట. రెండింటిలో ఒకటి ఫిక్స్ చేయాలని భావించారట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా మరో క్లైమాక్స్ పెట్టే ఆలోచన చేయడం చర్చనీయాంశమైందట. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారట దర్శకుడు. దీంతో.. క్లైమాక్స్ కూడా పార్ట్ 3కి సెట్ అయ్యేలా కసరత్తు చేయనున్నారట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? అన్నది ఇప్పుడు టాక్ నడుస్తోంది.
ఇక రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్ 15కి విడులద కష్టమేనంటున్నారు. ఇప్పటికి రెండు పాటలు రిలీజ్ చేశారు. ఇంకా నాలుగు పాటలను విడుదల చేయాల్సి ఉంది. ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పెండింగ్ లో ఉంది. ఇలా అనేక వర్కులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ చేంజ్ చేస్తున్నారన్న గాసిప్పులు బన్నీ అభిమానుల్ని టెన్షన్ పెడుతున్నాయి.
ఇవీ చదవండి: Gangs of Godavari: విష్వక్‌సేన్ సినిమా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
Hari Hara Veera Mallu: ఈ ఏడాది ఆఖరుకల్లా హరిహర వీరమల్లు విడుదలకు సన్నాహాలు!
Gangs Of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ.. విష్వక్‌సేన్ మెరిపించాడా?
NKR 21: నందమూరి కల్యాణ్ రామ్ 21వ మూవీ గ్లింప్స్.. అదిరిపోయిన ట్విస్ట్