Balakrishna: ఇటీవల హీరో బాలకృష్ణ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వేదికపై హీరోయిన్ అంజలిని తోసేసిన క్లిప్, బాలకృష్ణ కూర్చున్న పక్కనే లిక్కర్ బాటిల్ ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
స్టేజ్ పై హీరోయిన్ అంజలిని బాలకృష్ణ సరదాగానే తోసేశారని తెలిపారు. అనంతరం వాళ్లిద్దరూ హైఫై ఇచ్చుకున్నారని తెలిపారు. కానీ అంతకు ముందు జరిగిన అంశం, అనంతరం జరిగిన ఘటనలను కాకుండా కేవలం బాలయ్య తోసేసిన వీడియోనే వైరల్ చేస్తున్నారని తెలిపారు. కాంట్రవర్సీ చేయాలనే కొందరు ఇలా చేస్తున్నారని అసలు ఆ వీడియోకు ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారంటూ నాగవంశీ ప్రశ్నలు గుప్పించారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి వీడియో చూస్తే అందరికీ స్పష్టత వస్తుందని.. ఇలా సగం సగం చూస్తే ఏమీ అర్థం కాదందటూ హితవు పలికారు విశ్వక్ సేన్.
బాలకృష్ణ కూర్చున్న దగ్గర వాటర్ బాటిల్ తో పాటుగా మరో వాటర్ బాటిల్లో మద్యం ఉన్నట్లు కనిపించింది. ఈ వీడియోపై కూడా నిర్మాత నాగవంశీ. బాలయ్య కూర్చున్న దగ్గర బాటిల్స్ లాంటివేం లేవని కొట్టిపారేశారు. అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్ లో పెట్టారని ఆరోపించారు. బాలయ్య కూర్చున్న చోట అసలు ఏం పెట్టలేదన్నారు. ఈవెంట్ చేసింది తానేనని, అక్కడ అలాంటి బాటిల్స్ ఏం పెట్టలేదన్నారు.
ఇవీ చదవండి: NKR 21: నందమూరి కల్యాణ్ రామ్ 21వ మూవీ గ్లింప్స్.. అదిరిపోయిన ట్విస్ట్
Netflix: ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ మూవీ రికార్డ్.. 121మిలియన్ల వ్యూస్‌తో నంబర్ 1
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..