Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండింటినీ చూసుకుంటుండటంతో కొన్ని చిత్రాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటిలో హరి హర వీర మల్లు కూడా ఒకటి. దీంతోపాటు మరో రెండు సినిమాలు సైతం క్యూలో ఉన్నాయి. రాజకీయ కార్యకలాపాలు చూసుకోవడం, ఎన్నికల తరుణం కావడంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడపడంతో చిత్రాలు పెండింగ్ లో ఉన్నాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం మరికొన్నాళ్లు రాజకీయ వ్యవహారాలతో పవన్ బిజీగా గడపనున్నారు. ఆ తర్వాతే సినిమాలపై ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట హరి హర వీర మల్లు చిత్రాన్నే పూర్తి చేసేలా ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నిర్మాత ఎ.ఎం.రత్నం త్వరలోనే చిత్రీకరణని పునః ప్రారంభిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కూడా ఈ చిత్రానికి చేంజ్ అయ్యారు. ఇక నుంచి యువ దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మనోజ్ పరమహంస ఇప్పట్నుంచి కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ భాగం చిత్రీకరణని పూర్తి చేశారు. ఆయన పర్యవేక్షణలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్మాత వెల్లడించారు.
ఈ ఏడాది డిసెంబర్ మాసానికల్లా హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాత తెలిపారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సినిమా మొదటి భాగం హరి హర వీర మల్లు – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ గా థియేటర్ల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ దేవోల్, ఎం.నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
Read Also: Indian 2: ప్రతి సీనూ అద్భుతం.. అభిమానులకు పండగే: దర్శకుడు శంకర్
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
Gangs Of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ.. విష్వక్‌సేన్ మెరిపించాడా?
Kejriwal: తీహార్ జైలులో లొంగిపోనున్న కేజ్రీవాల్