Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో బాగా బిజీగా గడుపుతున్నాడు. గత ఏడాది సలార్ మూవీతో హిట్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు కల్కిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ మూవీ వస్తోంది. దీని తర్వాత ‘రాజా సాబ్’, ‘సలార్ 2’ సినిమాలకు సిద్ధం అవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇదే సమయంలోనే ప్రభాస్ గురించి ఓ గాసిప్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నడుస్తోంది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడని చర్చ నడుస్తోంది.
సదరు సినిమాలతో పాటే డార్లింగ్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల కిందటే ప్రేక్షకులకు తెలిసింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని చర్చ కూడా నడిచింది.
కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని తాజాగా సమాచారం అందుతోంది. ఇందులో నటిస్తున్నందుకు పూర్తిగా ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదన్నది ఈ గాసిప్ సారాంశం. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) తదితరులు కూడా కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అంతా న్యూజిలాండ్‌లో జరిపారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్‌తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప సినిమా టీజర్ విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ డేకు మాంచి ట్రీట్
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ వీడియో వైరల్.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
Tirumala Hills: తిరుమల 7 కొండలు ఎక్కడం వల్ల శ్రీవారి కృప ఇలా కలుగుతుంది..
[…] చదవండి: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో… Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ […]
[…] చదవండి: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీకి నో… Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై […]