HomeసినిమాPrabhas: ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?

Prabhas: ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?

Prabhas: ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న ప్రభాస్ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఓ పెట్టటారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఇన్‌స్టా పోస్ట్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రభాస్‌.. ఇప్పుడు ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ ప్రభాస్‌ ఆ పోస్టులో రాశారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాలో కమల్‌ హాసన్‌ లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసమే డార్లింగ్ ఈ పోస్ట్‌ పెట్టినట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తనకు కమల్‌ హాసన్‌ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్‌ అనేకమార్లు చెబుతూ వచ్చారు. కమల్‌ ఈ మూవీలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం.

కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’’ అని డార్లింగ్ గతంలో పోస్టు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే, దీనిపై మరికొందరు అభిమానులు మాత్రం ఆయన మ్యారేజ్‌ గురించే ఉంటుందంటూ కామెంట్స్ చేయడం విశేషం.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లరే ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). ఈ మూవీలో కమల్‌హాసన్‌ (Kamal Haasan) మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రభాస్‌ సరసన జోడీగా దీపిక పదుకొణె నటిస్తున్నారు. పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉందని తెలుస్తోంది. ఈ సినిమా జూన్‌ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవీ చదవండి: Prabhas: ప్రభాస్‌ కీలక నిర్ణయం.. ఆ మూవీకి నో రెమ్యునరేషన్‌?
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్‌ రియాక్షన్‌ ఇదీ..!
Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News