HomeరాజకీయాలుNTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

NTR: దివంగత ముఖ్యమంత్రి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావు 101వ జయంతి నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ లో లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని తెలిపారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన కొనసాగుతుందన్నారు.

తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్: వెంకయ్య నాయుడు
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను ఎన్టీఆర్ మెప్పించారన్నారు. రాజకీయాల్లోనూ నవశకానికి ఎన్టీఆర్ నాంది పలికారన్నారు. ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్ ఎదురొడ్డి నిలిచారన్నారు. గొప్ప సంస్కరణవాది నందమూరి తారక రామారావు అని శ్లాఘించారు.

ఎన్టీఆర్ ఓ శక్తి : బాలకృష్ణ
ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం అని ఆయన తనయుడు బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర రంగంలో మకుటంలేని రారాజుగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారని, కొంతమందికే పరిమితమైన రాజకీయాలను ఎందరికో పరిచయం చేశారని తెలిపారు. డాక్టర్లు, లాయర్లను ఎందరిని రాజకీయాల్లోకి ఆహ్వానించారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి తీసుకొచ్చారని, విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిన అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.

ఎన్టీఆర్ ఘాట్ లో పురందేశ్వరి నివాళులు
తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పారని పురందేశ్వరి అన్నారు. తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటారన్నారు. సినీ, రాజకీయ రంగాల ప్రభంజనం సృష్టించారని గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నందమూరి రామకృష్ణ నివాళులు
ప్రపంచవ్యాప్తంగా అన్న అని పిలుపించుకున్న ఏకైక నేత ఎన్టీఆర్ అని ఆయన తనయుడు రామకృష్ణ తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చారన్నారు. దాతల సాయంతో తిరుమలలో నిత్య అన్నదానానికి శ్రీకారం చుట్టారన్నారు.

Read also: Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు నోటీసులు
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్‌ థ్యాంక్స్!
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News