NTR: టాలీవుడ్‌లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన కథానాయకుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన మార్క్ నటనతో అభిమానులను పెద్ద సంఖ్యలో సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అభిమానులను తన కుటుంబ సభ్యులుగా భావించే ఎన్టీఆర్.. తన సినిమా ఈవెంట్లకు వచ్చే వారికి చివర్లో ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాలకు గురి కావొద్దంటూ సందేశమిస్తుంటారు. నా అభిమానులు నా కుటుంబసభ్యులంటూ సంబోధిస్తుంటారు. వారి కోసం కేర్ తీసుకుంటూ ఉంటారు.
ఇవాళ ఎన్టీఆర్ బర్త్‌డే. అభిమానులను ఫ్యాన్స్‌ని కుటుంబసభ్యులుగా భావించే ఆయన.. అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టును చేశారు. ‘‘ప్రియమైన అభిమానుల్లారా.. నటుడిగా నా ప్రయాణం మొదలైనరోజు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్.
మీ అసామాన్య ప్రేమకు కృతజ్ఞుడిని. ఆదివారం విడుదలైన ‘దేవర’ (Devara) పాటకు మీ నుంచి వచ్చిన స్పందన చాలా ఆంనందాన్ని ఇచ్చింది.” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తన స్నేహితులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
ఇక సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నారు. తనను బావా అని సంబోధించే అల్లు అర్జున్‌ను బావా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు ఎన్టీఆర్. అన్నా అంటూ మహేశ్ బాబును, బ్రదర్ అంటూ చరణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి పార్ట్ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.
ఇవీ చదవండి: NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Fear song from Devara: దేవర నుంచి సాంగ్ వచ్చేసింది.. అనిరుధ్ అరిపించేశాడుగా..!
Mrunal Thakur: యువ హీరోతో మృణాల్ ఠాకూర్ డేటింగ్? అసలు సంగతి ఏంటి?
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] Also: NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు… NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 […]