Allu Arjun: ఇటీవల మెగా ఫ్యామిలీలో రాజకీయ కాక రేగిన సంగతి తెలిసిందే. ఏపీలోని పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబం మొత్తం పవర్ స్టార్‌కు మద్దతుగా నిలిచింది. బుల్లితెర జబర్దస్త్ నటులంతా కలిసి పిఠాపురం వెళ్లి జనసేనానికి మద్దతు పలికారు.
చిరంజీవి సైతం తమ్ముడికి మద్దతుగా వీడియో సందేశం పంపారు. అయితే ఎటొచ్చీ పుష్ప సంగతే తేడా కొట్టింది. అల్లు అర్జున్.. పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టాడు. కానీ నంద్యాల వైసీపీ కేండేట్ శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి విజయానికి మాత్రం పోలింగ్ ముందురోజు స్వయంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి బన్నీ షాక్ ఇచ్చాడు. ఈ ఉదంతం మెగా ఫ్యామిలీలో చిచ్చురాజేసింది.
అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే… అంటూ నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ నెట్టింట రచ్చ జరిగింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై దండయాత్ర చేశారు. వీరికి వైసీపీ సోషల్ మీడియా తోడైంది. ఇంకేముంది.. దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కొన్నాళ్లు డీయాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది.
నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేశానంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తర్వాత ట్విట్టర్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ ఎన్నికల ప్రచారంలో చివరిరోజున అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కోసం ప్రచారం చేశాడు. దీంతో నాగబాబు అలా ట్వీట్ చేశాడంటూ అభిమానులు రచ్చ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.
సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో నాగబాబును ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని తెలుస్తోంది. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నారట. మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని చెబుతున్నారు. దీనిపై వాస్తవాలేంటో క్లారిటీ కోసం వెయిట్ చేయాల్సిందే.
ఇవీ చదవండి: Prabhas: ప్రభాస్ పోస్ట్ వైరల్.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్!
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
Manchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] […]