Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. మృణాల్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయడం గ్యారెంటీ. సీతారామం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా సరే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.
అయితే, ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టార్ కాస్త డిజాస్టర్ అయినా.. మిగతా మూవీలు హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టపట్టాలేసుకుని తిరగడం, అది కూడా కెమెరాలకు దొరకడంతో నెట్టింట మృణాల్ పేరు మార్మోగిపోతోంది.
2014 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ మృణాల్ ఠాకూర్‌కు ‘సీతారామం’ మూవీతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేయలేదు. కానీ ఫొటోషూట్స్ మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ గురించి మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కెమెరాల కంట పడటంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సిద్ధాంత్-మృణాల్ జంట దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఓ స్టార్ హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ బయట వీరిద్దరూ కెమెరాలకు చిక్కారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయట నడుచుకుంటూ వచ్చారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా బంధం కొనసాగుతోందా అన్న అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వీటిలో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.
#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T
— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024
ఇవీ చదవండి:Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
SSMB 29: గాసిప్స్‌కు చెక్ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] చదవండి: Mrunal Thakur: యువ హీరోతో మృణాల్ ఠాకూర్ డేటి… Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ […]
[…] […]