Manchu Lakshmi: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై సినీ నటి మంచు లక్ష్మి స్పందించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో మంచు లక్ష్మి పాల్గొన్నారు. మంచు లక్ష్మి, అజయ్, వేదిక, ప్రధాన పాత్రల్లో నటించన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’ (Yakshini). తేజ మార్ని డైరెక్షన్‌లో తెరకెక్కింది. వచ్చే నెల 14 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో ప్రసారం కానుంది. ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు లక్ష్మి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా రేవ్ పార్టీ గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదంటూ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత తాను నటించిన వెబ్ సిరీస్ రిలీజ్ అవుతోందన్నారు. దాని గురించి మాట్లాడదామంటూ దాటవేశారు. ఎవరో ఎక్కడికో వెళ్తే తనకేంటి సంబంధమంటూ ఆమె ప్రశ్నించారు. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్ అంతేనంటూ కామెంట్ చేశారు మంచు లక్ష్మి.
ఇక మిగతా అంశాల గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని, మీ బిడ్డనని తెలిపారు. తనది మొదటి నుంచి ముక్కుసూటిగా మనస్తతత్వం అని తెలిపారు. కొందరు ట్రోలింగ్ చేస్తుంటే బాధపడ్డానని తెలిపారు. పొలిటికల్‌గా మాట్లాడడం తమ వల్ల కాదన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతామని, అది కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదన్నారు. నచ్చినవాళ్లు అభిమానిస్తారని తెలిపారు. ఎవరో కావాలని తనను ట్రోల్ చేస్తారని భావించనన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారని, రానా, చరణ్, తారక్.. తాను అందరం కలిసి పెరిగామని తెలిపారు.
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం త్వరలో విడుల కానున్న నేపథ్యంలో ఆ మూవీలో తాను ఎందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారని మంచు లక్ష్మి అన్నారు. బహుశా తనకు సరిపోయే పాత్ర లేదేమోనన్నారు. అందుకే అవకాశం ఇవ్వలేదన్నారు. మనోజ్ కూడా లేడని, ఒకవేళ తాను, మనోజ్ కూడా ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అవుతుందంటూ మంచు లక్ష్మి కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Manchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్
Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
Prabhas: ప్రభాస్ పోస్ట్ వైరల్.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
[…] […]