Netflix: గత ఏడాది 2023 మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన సినిమా ఏదో మీకు తెలుసా? అదే ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’. 121మిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉందని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. వెబ్ సిరీస్ అయితే 72మిలియన్ల తో ‘వన్ పీస్’ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఇండియన్ సినిమాలు కోట్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఈ సంస్థ 2023లో అత్యధిక వ్యూస్ సాధించిన వాటి వివరాలను వెల్లడించింది. ‘వాట్ వి వాచ్డ్: ఎనెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్’ పేరుతో 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చిన వ్యూస్‌ను ప్రకటించారు. ఇందులో ఇండియన్ మూవీస్ సత్తా చాటాయి. సినిమాలు, సిరీస్, షోలు అన్ని కలిపి ఒక బిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.
వరల్డ్ వైడ్‌గా 2023 సెకండ్ హాఫ్‌లో 90 బిలియన్ల గంటల వ్యూస్ నమోదు అయినట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. కరీనా కపూర్ (Kareena Kapoor) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘జానెజాన్’ 20.2మిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో ఉంది. అనంతరం 16.2 మిలియన్ల వ్యూస్‌తో షారుక్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జవాన్’ ఉంది. మూడో స్థానంలో విశాల్ భరద్వాజ్ నటించిన ‘ఖుషియా’ (12.1 మిలియన్లు) నిలిచింది.
వీటితో పాటు ఓఎంజీ2, లస్ట్ స్టోరీస్2, డ్రీమ్ గర్ల్2 సినిమాలు సైతం ముందు వరుసలో నిలిచాయి. 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కించిన ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ 10.6 మిలియన్ల వ్యూస్‌ను సాధించిందని నెట్‌ఫ్లిక్స్ వివరించింది.
ఇవీ చదవండి: Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు, టెకీలు!
Allu Arjun: ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అలా స్పందించాడా?
Shilpa Shetty: స్టార్ హీరోయిన్.. ఓటు వేయడానికి రూ.3 కోట్ల కారులో..!