HomeసినిమాManchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్

Manchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్

Manchu Manoj: సినిమా కెరీర్‌లో అత్యంత ఎక్కువగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హీరో మంచు మనోజ్. ఈ మధ్య కాలంలో సినిమాలకు విరామం ప్రకటించిన ఆయన.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. సినిమా కెరీర్ పరంగా ఒక సందర్భంలో తాను తీవ్రంగా నిరాశ చెందానని, కానీ ఆ తర్వాత ఓపిక విలువ ఏంటో తనకు తెలిసిందంటున్నాడు మంచు హీరో.

మిరాయ్‌ (Mirai) ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మూవీలో మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్‌ డే సందర్భంగా టీమ్ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నేను వెండితెరపై కనిపించి సుమారు 8 ఏళ్లు అయ్యింది. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాలు, సినీ వేడుకలు.. ఇలా ఏదో ఒక విధంగా మీకు దగ్గరగా ఉంటున్నాను. కానీ, సినిమాలతోనే మిమ్మల్ని అలరించడం నాకు సంతోషం, ఆనందం. మీకు విభిన్న కథలను ఇంట్రడ్యూస్ చేయాలనేది నా తపన. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తాను. డబ్బు కోసం కాకుండా మనసుకు నచ్చిన స్టోరీలను సెలెక్ట్‌ చేసుకుంటూ వచ్చాను.

కాస్త విరామం తర్వాత మళ్లీ యాక్టింగ్‌ చేయాలని భావించి చాలా కథలు విన్నాను. వాటిలో కొన్ని నచ్చలేదు. నచ్చినవి అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేకపోయాయి. దీంతో చాలా నిరాశ చెందాల్సి వచ్చింది. ఓపిక విలువేంటో ఇప్పుడు బాగా అర్థమైంది. మనమిద్దరం కలిసి నటిద్దామంటూ తేజ నన్ను కలిశాడు. ఆ మేరకు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని నన్ను కాంటాక్ట్‌ అయ్యి, ‘మిరాయ్‌’ కథ వినిపించాడు. కథ వినగానే నాకు నచ్చింది. రెండు భాగాలుగా తీస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన మొదటి పార్ట్‌ విడుదల అవుతుంది.” అని మంచు మనోజ్‌ తెలిపాడు.

Read Also: NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్‌ థ్యాంక్స్!
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
Prabhas: ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
Prabhas: ప్రభాస్‌ కీలక నిర్ణయం.. ఆ మూవీకి నో రెమ్యునరేషన్‌?
Chiranjeevi: చిరు మూవీ అప్‌డేట్.. తమిళ దర్శకుడితో హిట్‌ ఖాయమా?

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News