NTR: జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. భూవివాదంపై హైకోర్టును తారక్ ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం తలెత్తింది. 2003లో గీతాలక్ష్మి నుంచి ప్లాట్ ను ఎన్టీఆర్ కొన్నారు. అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా లోన్లు పొందింది గీతాలక్ష్మి కుటుంబం. బ్యాంకుల నుంచి నకిలీ పత్రాలతో లోన్ పొందింది గీతాలక్ష్మి.
జూ.ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో లోన్ల విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుంచి ఇదే పత్రాలతో లోన్లు పొందింది గీతాలక్ష్మి. కేవలం ఒక బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పి అమ్మింది. చెన్నైలో ఓ బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ ను తారక్ తీసుకున్నారు.
2003 నుంచి ప్లాట్ ఓనర్ గా తారక్ ఉన్నారు. అప్పటి నుంచి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది. ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. తాజాగా డీఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు.
ఇవీ చదవండి: Prabhas: ప్రభాస్ పోస్ట్ వైరల్.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
[…] […]