HomeసినిమాNTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం

NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం

NTR: యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఎన్నికల రోజు హైదరాబాద్‌లో కెమెరాలకు చిక్కిన ఎన్టీఆర్.. బ్లూషర్ట్‌ వేసుకుని తళుక్కుమన్నాడు. హైదరాబాద్‌లో తారక్‌ ఓటు వేసిన సంగతి తెలిసిందే. తారక్‌ వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్ జరిగింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో ఘటనతో ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ తారక్ ఏం చేశాడో చూద్దాం.

ఎవరైనా చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులు ఇవి. అలాంటిది ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేట ఊరిలో వీరభద్ర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం రూ.12.5 లక్షలు విరాళం అందించింది. అయితే ఈ విషయం బయటకు పొక్కలేదు. తాజాగా కొందరు నెటిజన్లు శిలా ఫలకానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తారక్ ఉదారత నలుగురికీ తెలిసింది.

సినిమాల విషయం చూస్తే.. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆశలు మరింత రెట్టింపయ్యాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటేనే అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తున్నారు. రెండు భాగాలుగా దేవరను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. పార్ట్ -1ను ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఇవీ చదవండి: Mrunal Thakur: యువ హీరోతో మృణాల్‌ ఠాకూర్‌ డేటింగ్‌? అసలు సంగతి ఏంటి?
Vijay: విజయ్‌ ‘గోట్‌’కు ‘అవతార్‌’ ఎక్స్‌పర్టుల విజువల్స్‌!
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
SSMB 29: గాసిప్స్‌కు చెక్‌ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్‌.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత
PM Modi: సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ప్రధాని మోదీ మండిపాటు

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News