Janhvi Kapoor: అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. తన వివాహం గురించి అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తన పెళ్లి తిరుమలలోనే చేసుకుంటానని ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం ప్రమోషన్లలో బాగా బిజీగా గడుపుతోంది.
ఈ మూవీ ఈనెల మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట విడుదల వేడుకలో జాన్వీ (Janhvi Kapoor) మాట్లాడింది. ఈ సందర్భంగానే తనకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలో తెలిపింది.
నా కలలను తనవిగా భావించాలి.. నాకు ధైర్యం చెప్పాలి.. ఎప్పుడూ నన్ను సంతోషపరిచేలా ఉండాలి. నేను ఏడ్చినప్పుడు పక్కనే ఉండి అండగా నిలబడాలి. అలాంటి లక్షణాలు ఉన్న పర్సన్‌ను నేను మనువాడతా.. అని జాన్వీ చెప్పింది. ఇక జాన్వీ గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్‌తో (shikhar pahariya) డేటింగ్‌లో ఉందని బాలీవుడ్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం హోరెత్తుతోంది.
ఇటీవల ‘మైదాన్’ మూవీ ప్రీమియర్ షోలో జాన్వీ ‘శిఖు’ (శిఖర్ పహాడియా) అనే లోగో ఉన్న ఆభరణాన్ని ధరించి తళుక్కుమంది. ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే ఓ సందర్భంలో తన ఫోన్‌లో స్పీడ్ డయల్ లిస్ట్ నంబర్లను ప్రస్తావిస్తూ.. తన తండ్రి, చెల్లి, శిఖర్ పేర్లు ఉంటాయని వెల్లడించారు. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.
ఇక శరణ్‌శర్మ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కపూర్ నటించారు. అపూర్వ మోహతా, కరణ్‌జోహార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు.
జాన్వీ నటిస్తున్న తొలి తెలుగు మూవీ దేవర (Devara). జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో దేవర ట్రెండింగ్‌లో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ తంగం పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి తొలి పాట రానుంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు మే 19న మొదటి పాటను విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి: Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
Anupama Parameswaran: బ్లూ చీరలో అనుపమ తళతళ.. చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో రెమ్యునరేషన్?
Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ డేకు మాంచి ట్రీట్
[…] […]