Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో జాన్వీ వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర అంశాలను తెలుపుతున్నారు.
తనకు చరిత్ర అంటే చాలా ఆసక్తి అని జాన్వీ చెప్పింది. బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీల గురించి జాన్వీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిద్దరి గురించి వినడం, మాట్లాడటం తనకెంతో ఇష్టమని జాన్వీ తెలిపారు. వీళ్లు మన సమాజానికి ఎంతో హెల్ప్ చేశారన్నారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని, అందుకే ఈ ఇద్దరికీ సంబంధించిన ఏ అంశమైనా ఇంట్రస్ట్‌గా ఉంటుందన్నారు.
కులాలపై అంబేడ్కర్ దృక్కోణం తొలి నుంచి చాలా కఠినంగానే ఉండేదన్నారు. కాలక్రమేణా గాంధీ దాన్ని మారుస్తూ వచ్చారని తెలిపారు. మన సమాజంలో కుల సమస్య అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందన్న జాన్వీ.. కులంపై మూడో వ్యక్తి అభిప్రాయం.. ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వారి అభిప్రాయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని అభిప్రాయపడింది.
తన ఫొటోల గురించి కూడా జాన్వీ మాట్లాడింది. సెలబ్రిటీల లేటెస్ట్ ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారని కామెంట్స్ చేసింది. అందుకే తారలు కనిపించగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో ఫొటోలను బంధిస్తారని తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 25 సార్లు విమానంలో ప్రయాణించినట్లు వెల్లడించారు.
విమానాశ్రయానికి వెళ్లేసరికే ఫొటోగ్రాఫర్లు అక్కడ రెడీగా ఉంటారని జాన్వీ తెలిపింది. సినీతారల కోసం ఫొటోగ్రాఫర్లు ఎదురుచూసే ప్రాంతాల్లో జిమ్ కూడా ఒకటని జాన్వీ తెలిపింది. జిమ్ బయట సెలబ్రిటీలను ఫొటోగ్రాఫర్లు వీడియోలు, ఫొటోలు తీస్తుంటారని తెలిపింది. తనను అలా తీయొద్దని చాలాసార్లు కోరానని జాన్వీ తెలిపింది. జిమ్ చేసే సమయంలో టైట్ డ్రెస్‌లు వేసుకుంటానని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్ అయితే తనకు అలాంటి డ్రెస్సింగ్ మాత్రమే ఇష్టమని అందరూ భావిస్తారని.. అందుకే తనకు జిమ్ బయట ఫొటోలు దిగడం నచ్చదని జాన్వీ తెలిపారు.
Read Also: Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
Netflix: ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ మూవీ రికార్డ్.. 121మిలియన్ల వ్యూస్‌తో నంబర్ 1