SSMB 29: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం SSMB 29. మహేష్‌బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ చిత్రాన్ని. ఇందుకోసం ప్రత్యేకంగా హెయిర్ స్టైల్‌ను కూడా సెట్ చేసుకుంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత మూవీ కావడంతో రాజమౌళి కూడా ఈ కథపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. మహేష్ బాబుతో తొలిసారి మూవీ తీస్తుండడంతో పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు లుక్‌ని బాగా మారుస్తున్నారు. ఈ మూవీ కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతోంది.
ఇక ఈ టాపిక్ ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం ఫిల్మ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్ అని భోగట్టా. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు దక్షిణాది కథలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో సైతం జాన్వీ కపూర్ చాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు -రాజమౌళి కాంబోలో వస్తున్ SSMB 29 చిత్రంలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా అప్పియర్స్ ఉంటుందని చెబుతున్నారట దర్శకుడు రాజమౌళి. అందుకే ఆమెను సెలెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి: Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
SSMB 29: గాసిప్స్‌కు చెక్ పెట్టిన శ్రీదుర్గ ఆర్ట్స్.. మహేష్‌బాబు సినిమాపై స్పష్టత
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్!