Shilpa Shetty: సెలబ్రిటీలు అంటే ఎక్కడలేని ఫోకస్ ఉంటుంది మన దేశంలో. ప్రత్యేకించి ముంబై లాంటి ప్రాంతాల్లో సెలబ్రిటీలు ఎక్కడికెళ్లినా వారి వెంట కెమెరాలు కదులుతుంటాయి. సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎక్కడికి వెళ్లినా లగ్జరీనే. సినీ తారలైతే మరీ కెమెరాల ఫోకస్ ఎక్కువ. దీంతో వారు బయటికి వచ్చారంటే వేరే లెవల్లో ఫాలోయింగ్ ఉంటుంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇవాళ 5వ విడత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని బాలీవుడ్ ప్రముఖులంందరూ ఓటు వేయడానికి తరలి వచ్చారు. పలువురు అగ్రతారలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిని మీడియా హైలెట్ చేసింది.
ఈ క్రమంలో ముంబైలో ఓ ఆసక్తికర సీన్ కనిపించింది. బాలీవుడ్ భామ శిల్పా శెట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. తన వెంట తల్లి సునంద, సోదరి షమితతో కలిసి వచ్చారు. అయితే, వారంతా ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారులో ఓటు వేసేందుకు రావడం అందర్నీ ఓ లుక్కేసేలా చేసింది.
ఆమె ఇటీవలే స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. శిల్పాశెట్టి చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో నటించింది. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
Read Also:Prabhas: ప్రభాస్ పోస్ట్ వైరల్.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్!
Chiranjeevi: చిరు మూవీ అప్‌డేట్.. తమిళ దర్శకుడితో హిట్ ఖాయమా?
Manchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం