Fear song from Devara: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర మూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. సంగీత ప్రేమికులను కట్టిపడేసేలా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యేక స్వరాలను సమకూర్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా తెరంగేట్రం చేస్తున్న దేవర మూవీ అనేక సంచలనాలు నమోదు చేసే దిశగా రానుంది.
జాన్వీ కపూర్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దేవర సాంగ్ రిలీజ్ అయిన వెంటనే లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఫస్ట్ సింగిల్ కి చాలా హైప్ ఇచ్చారు. తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అనిరుధ్ తనదైన శైలిలో బాణీలు సమకూర్చారని చెబుతున్నారు. తారక్ పాత్రపై మంచి ఎలివేషన్స్ వేస్తూ సాగిన సాహిత్యం అనిరుధ్ గాత్రంతో మరింత రక్తి కట్టించింది. మెయిన్ గా సాంగ్ డిజైన్ చూసేందుకు చూపరులను కట్టిపడేస్తోందని చెబుతున్నారు. ఈ విషయంలో అనిరుధ్ మరోసారి తన మార్క్ చూపించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌పై చూపించిన కొన్ని విజువల్స్ సాంగ్ చివరలో తన ప్రెజెన్స్ అత్యద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఫ్యాన్స్ కి మాంచి ట్రీట్ ఇచ్చేలా ఈ సాంగ్ ఉందంటున్నారు. ఈ భారీ మూవీకి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నాయి. ఈ అక్టోబర్ 10న సినిమా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది.
ఇవీ చదవండి: CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
[…] చదవండి: Fear song from Devara: దేవర నుంచి సాంగ్ వచ్చేసింది..… CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ […]
[…] చదవండి: Fear song from Devara: దేవర నుంచి సాంగ్ వచ్చేసింది..… NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ […]