HomeసినిమాIndian 2: ప్రతి సీనూ అద్భుతం.. అభిమానులకు పండగే: దర్శకుడు శంకర్

Indian 2: ప్రతి సీనూ అద్భుతం.. అభిమానులకు పండగే: దర్శకుడు శంకర్

Indian 2: ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. (Indian 2) ఈ చిత్రంలో కథానాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)కు సంబంధించిన ప్రతి సన్నివేశం అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. అభిమానులకు పండగేనంటూ అంచనాలు మరింత పెంచారు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ వచ్చే నెల జూలై 12న థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో విడుదల వేడుక (Indian 2 Audio Launch)ను తాజాగా నిర్వహించింది. ఆ వేదికపై దర్శకుడు శంకర్‌ మాట్లాడారు. భారతీయుడు 2 మూవీలో ప్రతి సీన్‌లోనూ కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా చేశారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో తొలిసారి కలిసి పనిచేశానన్నారు. ఆరు మంచి పాటలు అనిరుధ్‌ అందించారని మెచ్చుకున్నారు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో కనిపించదని, ‘భారతీయుడు 3’లో ఆమె పాత్ర ఉంటుందంటూ దర్శకుడు తెలిపారు.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మరో డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్ మాట్లాడారు. భారతీయుడు 2 చిత్రం ప్రకటన వెలువడిన తర్వాత విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. శంకర్‌, కమల్‌, అనిరుధ్‌లను తానెప్పుడు కలిసినా ఈ మూవీ అప్‌డేట్స్‌ గురించే ఆసక్తిగా అడిగేవాడినన్నారు.

ఇండియన్ 2 సినిమా చిత్రీకరణ సమయంలో పలు సమస్యలు చుట్టుముట్టాయి. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టు పునః ప్రారంభమైందని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హీరో కమల్‌ హాసన్. ఈ ప్రాజెక్టులో భాగమైన కాజల్ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈవెంట్‌లో పాల్గొని తళుక్కుమన్నారు.

మౌనీరాయ్‌ తన డ్యాన్స్‌తో, అనిరుధ్ పాటలతో ఈవెంట్‌కు మరింత వన్నె తెచ్చారు. బ్రహ్మానందం, శింబు తదితరులు సైతం హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని కోరుకున్నారు. ఇండియన్ 2 చిత్రానికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు ఈ మూవీ సీక్వెల్‌గా వస్తుండడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అవినీతిపరుల భరతం పట్టేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్‌ మరోసారి నట విశ్వరూపం చూపింబోతున్నారు. సిద్ధార్థ్‌, ప్రియా భవానీశంకర్‌, బాబీ సింహా లాంటి నటులు కీ రోల్‌లో నటిస్తున్నారు.

Read Also; Gangs Of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రివ్యూ.. విష్వక్‌సేన్ మెరిపించాడా?
Money: ఏపీలో ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం సీజ్
Elections: రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
Vijay: విజయ్‌ ‘గోట్‌’కు ‘అవతార్‌’ ఎక్స్‌పర్టుల విజువల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News