HomeసినిమాKangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!

Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!

Kangana Ranaut: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ నటించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency). ఈ మూవీ తాజాగా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటిస్తూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ చిత్రం జూన్‌ 14న విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కంగనా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉందని, అందుకే మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కంగన ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

“మా క్వీన్‌ కంగనా రనౌత్‌పై (Kangana Ranaut) అభిమానులు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. దేశం కోసం తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి, దేశానికి సేవ చేయాలని చిత్తశుద్ధికి ఆమె నిరంతరం కష్టపడుతున్నారు. ఇప్పుడు పూర్తి ప్రాధాన్యతను ఆమె రాజకీయాలకే కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. వాయిదా వేస్తున్నాం.

త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ సినిమా కచ్చితంగా అభిమానులందరికీ నచ్చుతుంది. నిరంతరం మద్దతుగా నిలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని చిత్ర బృందం పోస్ట్‌లో తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా పోటీ చేస్తోంది.

ఇక చిత్రం ‘ఎమర్జెన్సీ’లో కంగన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా ఉన్నారు. ఒక సందర్భంలో ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తాకట్టుపెట్టానని తెలిపారు. తొలి షెడ్యూల్ సమయంలో డెంగీ వ్యాధి సోకిందని, రక్తకణాల సంఖ్య పెత్త సంఖ్యలో పడిపోయినా షూటింగ్‌లో పాల్గొన్నట్టు చెప్పింది.

ఇవీ చదవండి: Salaar2: సలార్‌ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్‌ విలన్‌గా మలయాళ నటుడు!
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ చేయలేకపోయిన హిట్‌ సినిమాలు ఇవేనట!
Kiara Advani: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారాకు అరుదైన అవకాశం
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Anupama Parameswaran: బ్లూ చీరలో అనుపమ తళతళ.. చీర ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News