Salaar2: డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం హిట్ కావడంతో దీని సీక్వెల్‌పై అందరి దృష్టి ఉంది. సీజ్ ఫైర్‌తో తిరిగి హిట్ ట్రాక్‌లోపడ్డ ప్రభాస్ (Prabhas).. సలార్ 2పై ఫోకస్ పెట్టారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి ‘సలార్2: శౌర్యంగ పర్వం’ పై పడింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీపై ఓ ఆసక్తికర గాసిప్ బయటకొచ్చింది. ఇప్పటికే ఖాన్సార్ బడా విలన్లతో గ్యారేజ్ నిండిపోగా.. ఇప్పుడు మరో కొత్త పాత్ర అక్కడ దిగేందుకు సన్నద్ధమైంది.
విలన్‌గా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) సలార్ 2లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానీ ‘దసరా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఈ నటుడు.. ఇప్పుడు సలార్-2లో ఎంటర్ ఇస్తున్నాడట. చాకోకు ఇప్పటికే ప్రశాంత్ నీల్ స్టోరీ చెప్పేశాడట. దీంతో ఈ కథపై మంత్రముగ్ధుడైన ఆయన వెంటనే ఒప్పుకున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందట.
చాకో పాత్ర కథానాయకుడు ప్రభాస్‌ను సమ ఉజ్జీగా ఢీకొనేలా ఉంటుందని ఫిల్మ్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. శౌర్యాంగపర్వాన్ని మరింత థ్రిల్లింగ్ గా తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ ఈ చర్యలు తీసుకున్నాడట. ఇందులో భాగంగానే చాకోను విలన్ పాత్రకు తీసుకుంటున్నట్లు వినికిడి. క్రూరత్వం నిండిన ఆ పాత్ర కథను మరింత రక్తి కట్టిస్తుందని భావిస్తున్నారు.
సలార్ ఒకటో పార్ట్‌లో వదిలేసిన చాలా ఆసక్తికర ప్రశ్నలకు ‘శౌర్యంగ పర్వం’లో జవాబులు లభిస్తాయని చర్చ నడుస్తోంది. పైగా ఇటీవల పృథ్వీరాజ్ సుకుమార్ పంచుకున్న మరో అప్‌డేట్ మూవీపై అంచనాలు రెట్టింపు చేసింది. సలార్2 నుంచి నీల్ యూనివర్స్‌లో మరో చిత్రానికి కనెక్షన్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శివమన్నార్ రోల్ మరింత ముఖ్యపాత్రగా ఉంటుందట. ఇక కేజీయఫ్ మూవీతో కనెక్షన్ ఉంటుందా? లేదా దర్శకుడు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో త్వరలో రానున్న మూవీతో లింక్ పెడతారా? అనేది వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
Anupama Parameswaran: బ్లూ చీరలో అనుపమ తళతళ.. చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో రెమ్యునరేషన్?
Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ డేకు మాంచి ట్రీట్
[…] […]
[…] […]
[…] […]
[…] […]