HomeసినిమాChiranjeevi: చిరు మూవీ అప్‌డేట్.. తమిళ దర్శకుడితో హిట్‌ ఖాయమా?

Chiranjeevi: చిరు మూవీ అప్‌డేట్.. తమిళ దర్శకుడితో హిట్‌ ఖాయమా?

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీతో పాటూ తన కూతురు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఓ మూవీ చేయనున్నట్లు చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అప్‌డేట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అప్‌డేట్‌ మేరకు.. ఈ ప్రాజెక్టును తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నట్లు భోగట్టా.

తొలుత ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ అటు తర్వాత కొన్ని రోజుల పాటు దీనిప ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా మోహన్‌రాజాకు ఈ ప్రాజెక్ట్‌ అప్పగించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్క్రిప్ట్‌ నరేషన్‌ కూడా కొలిక్కి వచ్చిందని టాక్‌. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇది నచ్చిందని, ఆ మేరకు ఓకే చెప్పేశారని సమాచారం.

అతి త్వరలో దీనిపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌ నగర్‌ సర్కిళ్లలో గుసగుస. మోహన్‌ రాజా- చిరంజీవి కాంబోలో మూవీ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరి కలయికలో ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ వచ్చింది. ఆ చిత్రం ప్రేక్షకాదరణకు నోచుకోకపోయినా ఆయన డైరెక్షన్‌పై చిరు (Chiranjeevi) మెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ వేగంగా కొనసాగుతోంది. ఓ భారీ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే పాటలు కూడా సిద్ధం చేయాలని చిత్రబృందం అనుకుంటోందట. జూలై నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్‌ అనుకుంటోందట. త్వరలోనే కంప్యూటర్‌ గ్రాఫిక్‌ పని కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఈ నవంబర్‌ నాటికి సీజీ వర్క్‌ కంప్లీట్‌ చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

ఇవీ చదవండి: Fear song from Devara: దేవర నుంచి సాంగ్ వచ్చేసింది.. అనిరుధ్‌ అరిపించేశాడుగా..!
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్‌ డేకు మాంచి ట్రీట్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News