Anupama Parameswaran: యువ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీతో అలరించింది. ఈ మూవీతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిందీ భామ. ప్రేమమ్ అనే మలయాళ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తోంది. అనేక మూవీల్లో హీరోయిన్‌గా పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసింది. అయితే ఇటీవల రొటీన్ క్యారెక్టర్లకు, ఫక్తు కథలకు ఫుల్ స్టాప్ పెడుతూ డోసు పెంచింది అనుపమ. ఎన్నాళ్లని ఒకే రకమైన మూవీస్ అని బోర్ కొట్టేసిందో ఏమో.. ఇటీవల తన గ్లామర్‌కు డోసును పెంచేసింది.
ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించేందుకు వెనుకాడలేదు అనుపమ. దీంతో అభిమానులంతా నటించి అందరినీ ఆర్చర్యానికి గురి చేసింది. మా అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ఆశ్చర్యచకితులయ్యారు. కొందరైతే ఏకంగా వీడియోలు చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందంటూ అనుపమ సమర్థించింది. టిల్లు మూవీ సక్సెస్‌తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.
ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని సైతం పెంచిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సినిమాకు రూ.కోటి తీసుకుంటున్న ఈ అమ్మడు.. టిల్లు స్క్వేర్ హిట్‌తో దాన్ని డబుల్ చేసిందట. ఒక్కో మూవీకి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. తాజాగా అనుపమ బ్లూ చీరలో దర్శనమిచ్చింది. నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పంచుకుంది. ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15,000 అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో రెమ్యునరేషన్?
Devara: దేవర నుంచి కీలక అప్‌డేట్.. బర్త్ డేకు మాంచి ట్రీట్
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ వీడియో వైరల్.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!