Actor Hema: బెంగళూరులో గత వారం జరిగిన రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమెకు డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, హైదరాబాద్ లో వంట చేస్తూ బిజీగా ఉన్నానని నటి హేమ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే, అనంతరం బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే, ఆమె అనారోగ్య కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాలేదు. తాజాగతా మరోసారి హేమకు నోటీసులు ఇవ్వడంతో ఆమె బెంగళూరు పోలీసులకు లొంగిపోయింది. హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్నారు హేమ.
నటి హేమ అరెస్ట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం హేమను పోలీసులు అరెస్టు చేశారు. నటి హేమకు వైద్య పరీక్షలను పోలీసులు నిర్వహించనున్నారు. నటి హేమను రేపు కోర్టులో హాజరు పరచనున్నారు బెంగళూరు పోలీసులు.
Read also: Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఏ నియోజకవర్గం ఎన్ని రౌండ్లు?
SSMB 29: మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్?
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు నోటీసులు
Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు, టెకీలు!
Balakrishna: బాలకృష్ణ అంజలిని తోసేయడంపై హీరో, నిర్మాత క్లారిటీ