Kiara Advani: బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీకి (Kiara Advani) అరుదైన అవకాశం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ (2024 Cannes Film Festival)లో కియారా పాల్గొననుంది. రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించే విమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్ ఈవెంట్‌కు భారత్ తరఫున పార్టిసిపేట్ చేస్తోందీ అందాల భామ.
వ్యానిటీ ఫెయిర్ హోస్ట్ చేసే ఈ ఈవెంట్‌లో వేర్వేరు దేశాలకు చెందిన ఆరు మంది ప్రతిభావంతులైన నటులు పాల్గొంటారు. ఈ నెల 18వ తేదీన లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ ప్రోగ్రామ్ అట్టహాసంగా జరగబోతోంది. గతంలో.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, పూజా హెగ్డే లాంటి అందాల భామలు ఈ ఫిల్మ్ ఫెస్టివ్‌లో పాల్గొని తళుక్కుమన్నారు. ఈసారి శోభిత దూళిపాళ్ల కూడా పాల్గొనబోతోంది.
ఫ్రాన్స్ దేశంలో 77వ ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం భారీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘భారత్ పర్వ్’ పేరుతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రోగ్రామ్‌ను సైతం నిర్వహించబోతోంది. ‘భారత్ స్టాల్’నూ ఏర్పాటు చేయనుంది. సినీ ప్రముఖులతోపాటు పలువురు పొలిటికల్ నేతలు పాల్గొంటారు.
చలన చిత్ర పరిశ్రమలోని ఆర్థిక పరిస్థితులు, సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసే విధానాల గురించి ఈ ఈవెంట్లలో చర్చలు జరపనున్నారు. మే 25వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌లో 20వ తేదీన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం టీజర్‌ని విడుదల చేస్తారు.
ఈ మూవీలో మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నారు. దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానుంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కూడా కీలక పాత్రల్లో యాక్టింగ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
Anupama Parameswaran: బ్లూ చీరలో అనుపమ తళతళ.. చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీలో నో రెమ్యునరేషన్?