Kangana Ranaut: గతంలో ఓ సినిమాలో నటించిన హీరో ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయనే రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan). ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన సినిమాలపై మోజుతో బాలీవుడ్ లో ఓ చిత్రంలో నటించారు. అయితే, తాజాగా ఆయన సినిమా కెరీర్ పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. తనకు నటించడం రాదన్నారు. తనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కంగనా రనౌత్ (Kangana Ranaut) ఎన్నటికీ ఒప్పుకోదన్నారు.
తాను మళ్లీ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక డిజాస్టర్ తర్వాత మళ్లీ రాలేనంటూ కామెంట్ చేశారు. ఆ సినిమా చూసిన వారెవరైనా తన నిర్ణయం సరైందే అని చెబుతారన్నారు. బాలీవుడ్‌లో ఆ వైఫల్యం జీవితంలో ఏం చేయకూడదో తానకు గుణపాఠం నేర్పిందన్నారు. నటుడిగా తన కెరీర్‌ను మొదలుపెట్టినా.. అది తాను చేయాల్సిన పని కాదని గ్రహించానన్నారు. తన యాక్టింగ్ ఎలా ఉంటుందో తనతో నటించిన కంగనా రనౌత్‌కు బాగా తెలుసని కామెంట చేశారు.
మరోవైపు పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదన్నారు. బహుశా తన తల్లి ఇప్పటికే అమ్మాయిని వెతికే పనిలో ఉందంటూ అసలు విషయం చెప్పారు. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత అని, వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత వృత్తే ప్రాధాన్యం అని భాగస్వామితో చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన వృత్తిపైనే ఫోకస్ పెట్టానన్నారు.
ఇప్పుడు జీవిత టైమ్ కేటాయించలేనన్నారు. తాను ఇప్పుడు ఎంపీని అని, కేంద్ర మంత్రిని అని, ప్రత్యక్షంగా, పరోక్షంగా తన నియోజకవర్గంలోని 25 లక్షల మందికి తాను జవాబుదారీగా ఉండాలంటూ చిరాగ్ వ్యాఖ్యానించారు. 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో చిరాగ్ పాశ్వాన్, కంగనా రనౌత్ జంటగా కనిపించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఇవీ చదవండి: Microsoft: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు
Vote: నోటాకు ఓటేశారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు
Gudivada Amarnath: మీ హయాంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేదు?
Yoga: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం.. యోగా
Hari Hara Veera Mallu: ఈ ఏడాది ఆఖరుకల్లా హరిహర వీరమల్లు విడుదలకు సన్నాహాలు!