HomeరాజకీయాలుCS Neerab Kumar Prasad: రాజధాని అమరావతి పనులపై వేగం పెంచిన చంద్రబాబు సర్కార్

CS Neerab Kumar Prasad: రాజధాని అమరావతి పనులపై వేగం పెంచిన చంద్రబాబు సర్కార్

CS Neerab Kumar Prasad: రాజధాని అమరావతిలో స్తబ్దుగా ఉండిపోయిన పనులను చంద్రబాబు సర్కార్ పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ రాజధాని ప్రాంతంలో ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు.

ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సీఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓలో నివాస భవనాల సముదాయాలను సీఎస్ పరిశీలించారు.

అనంతరం హైకోర్టు ప్రాంతం తదితర చోట్ల సీఎస్ పరిశీలన చేశారు. ఈ పర్యటనలో సీఎస్ తో పాటు సీఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఎస్ఈ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Read Also: Chandrababu Oath: చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Jawahar Reddy: డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 27 వరకు ఈఎల్‌ మంజూరు
AP CS: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు
Chandrababu: ఈనెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం
Tadepalli: తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News