HomeరాజకీయాలుChandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 7:30 గంటలకు శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహం నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం ముఖద్వారం చేరుకోగా టీటీడీ జేఈ ఓ వీరబ్రహ్మం ఆలయ అర్చకులు ఇస్తకఫాల్ స్వాగతం పలకగా ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు శ్రీవారి ప్రతిమను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్ స్వామి మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అఖండ దీపం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చదవండి: Muddada Ravi chandra: సీఎం పేషీలోకి తొలి అధికారి.. చంద్రబాబు ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
CM Chandrababu: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
CS Neerab Kumar Prasad: రాజధాని అమరావతి పనులపై వేగం పెంచిన చంద్రబాబు సర్కార్
Chandrababu Oath: చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News