Rammohan Naidu: ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ – బెంగళూరు ,విశాఖ – చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామన్నారు.
ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల మంజూరు అయ్యాయన్నారు. వివిధ రకాల పరిశ్రలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తోందని వెల్లడించారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. కొప్పర్తి విశాఖ – చెన్నై కారిడార్ కిందకు వస్తుందన్నారు. కొప్పర్తి ఉత్పత్తి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
కేంద్రం,రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు.. గత ఐదేళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిందని విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజన్ గ్రోత్ ఎలా ఉందో చూస్తున్నామని కామెంట్ చేశారు. పోలవరం ప్రాజక్టుకు రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి ఏపీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే నవంబరులో పోలవం పనలు మళ్లీ ప్రారంభించేలోగా నిధులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కూటమిలో చేరికలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయడు స్పందించారు. ఏ పార్టీ నేతలు కూటమిలోకి వచ్చినా పదవికి రాజీనామా చేసి రావాలని కామెంట్ చేశారు.
Read also: Narayana: టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తాం: మంత్రి నారాయణ
Varudhu Kalyani: హోంమంత్రి అనితపై వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు
Grama Sabhalu: గ్రామ సభల ప్రారంభంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: మా సంగతి కాస్త చూడండి.. పవన్‌కు మద్యం షాపుల్లో పని చేస్తున్న యువకుల వినతి