Narayana: గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 14 రోడ్లు నిర్మించేందుకు రూ.2,500 కోట్ల మేర మున్సిపల్ అధికారులు టీడీఆర్ బాండ్లు జారీ చేశారన్నారు. అందులో వైసీపీ నేతలు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయన్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ బాండ్ల జారీపై ఆరోపణలు ఉన్నాయన్న మంత్రి నారాయణ.. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని తెలిపారు. సెప్టెంబర్ చివరినాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేలుస్తామని వెల్లడించారు.
కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని విమర్శలు గుప్పించారు. ఇక, పురపాలక శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వివరించారు. సెప్టెంబరు 13న రాష్ట్రంలో మరో 75 అన్న క్యాంటీన్లను మొదలు పెడతామన్నారు.
Read also: Varudhu Kalyani: హోంమంత్రి అనితపై వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు
Grama Sabhalu: గ్రామ సభల ప్రారంభంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?