HomeరాజకీయాలుChandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు

Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు

Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలని సీఎం చంద్రబాబు అననారు. పారిశ్రామికాభివృద్ధిపై టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్, అధికారులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రికి వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి గతంలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు.

ప్రస్తుతం 53శాతం రామెటీరియల్ కింద రాష్ట్రం నుండి వెళుతున్నాయని వాటికి ఏవిధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని అన్నారు. పిపిపి, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు అవసమరైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయని సీయం అన్నారు.

దేశంలో ఏరాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కావున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని సీయం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాక దేశ పశ్చిమ తీరం కంటే తూర్పుతీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానించబడి ఉందని, నదుల అనుసంధానం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయగోరే వారికి అన్ని విధాలా అనుకూలమైన అంశాలని పేర్కొన్నారు. వేగవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దానిని ఏపికి తీసుకువచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో కర్నాటకకు వెళ్ళి పోయిన హీరో మోటార్స్, తెలంగాణాకు వెళ్ళిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను ఎపికి తీసుకువచ్చామని సియం చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం రూపకల్పన జరగాలని చెప్పారు. ఈనెల 16న పారిశ్రామక వేత్తలతో సమావేశం కానున్నామని, అదే విధంగా ఈనెల 23న మళ్లీ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానంపై మరొకసారి సమావేశమై చర్చిద్దామని సీయం చంద్రబాబు అధికారులకు చెప్పారు.

ఇవీ చదవండి: Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?
AI Women: ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.. జరా శతావరిని చూశారా?
Mobile Theft: రైల్లో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే ఇలా చేయండి
Voting: మీ ఓటును ఎవరో వేసేశారా? ఏం చేయాలంటే..
Kangana Ranaut: నాకు నటన రాదు.. నా సరసన నటించేందుకు కంగన ఒప్పుకోదు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News