Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా వచ్చే ఐదేళ్లలో తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రవాణా మరియు యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని శాప్ (SAAP) సమావేశ మందిరంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ అమరావతి పేరుతో వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేస్తామన్నారు. గల్లీ నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సహకానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాసక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామన్నారు. అలాగే క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు.
Read also: Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..
Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు
Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?
AI Women: ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.. జరా శతావరిని చూశారా?