HomeరాజకీయాలుGudlavalleru: హిడెన్ కెమెరాల ఆరోపణలపై ఎలాంటి స్పై కెమెరాలు గుర్తించలేదు: ఏలూరు రేంజ్ ఐజీ

Gudlavalleru: హిడెన్ కెమెరాల ఆరోపణలపై ఎలాంటి స్పై కెమెరాలు గుర్తించలేదు: ఏలూరు రేంజ్ ఐజీ

Gudlavalleru: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూములలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఈరోజు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు.

క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామని చెప్పారు. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు.

హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

వాష్ రూమ్ ల, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదన్నారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారణ చేశామన్నారు. విచారణలో కెమెరాలు కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదన్నారు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారన్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించామని, వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించామన్నారు.

విద్యార్థులు ఎవరూ భయపడనవసరం లేదని భరోసా ఇచ్చారు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదన్నారు. ఢిల్లీ సంస్థ CERT టెక్నికల్ విచారణ జరుగుతోందని, మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుందన్నారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చని క్లారిటీ ఇచ్చారు. కళాశాల యజమానియానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామన్నారు.

ఇవీ చదవండి: Devara: అనిరుధ్ స్పెషల్.. దేవర కొత్త వీడియో సాంగ్ ఇక్కడ చూసేయండి
Mahesh babu: నేనెంతో సంబరపడుతున్నా.. ఎంజాయ్ యువర్ లైఫ్: మహేష్ బాబు
Mohanlal: మలయాళ సినిమా ఇండస్ట్రీని నాయశనం చేయొద్దు.. మోహన్ లాల్
Perni Nani: నమ్మినవారిని మోసం చేయడం బాబుకు అలవాటు: పేర్ని నాని
Kadambari Jethwani: ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారంలో ఏపీ సర్కార్ కీలక చర్యలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News