Mohanlal: మళయాల చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న హేమ కమిటీ నివేదికల వ్యవహారం (malayalam film industry allegations) ముదురుతోంది. దీనిపై కేవలం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)ను లక్ష్యంగా చేసుకోవద్దని ఆ సంఘం మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ (Mohanlal) కోరారు.
హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను రిలీజ్ చేయాలని సర్కారు డెసిషన్ తీసుకోవడం శుభపరిణామమన్నారు. అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వడం కుదిరే పని కాదన్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ అని మోహన్ లాల్ తెలిపారు. ఇందులో చాలామంది ఉన్నారన్నారు. అందరినీ నిందించలేమని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దంటూ కోరారు. దోషులకు శిక్ష తప్పదని పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రిజైన్ చేశారు.
Read also: Prabhas: ప్రభాస్ పోస్ట్ వైరల్.. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో?
Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు