Kadambari Jethwani: ముంబై కథానాయిక కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆమె ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తున్నారు. వేధింపుల వ్యవహారానికి సంబంధించి కాదంబరి జత్వానీ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు.
జత్వానీ న్యాయవాదులు, ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ నగర పోలీసు కమీషనర్ మాట్లాడారు. దర్యాప్తు అధికారిగా ఉన్న డాక్టర్ స్రవంతి రాయ్‌తో కూడా జత్వానీ ఫోన్లో మాట్లాడారు. కేసు వివరాలను, సాక్ష్యాలను, ఆమె ఎదుర్కొన్న వేధింపుల వివరాలను తమకు వివరించాలని స్రవంతి రాయ్ కోరారు.
నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారన్నారు.
‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Nara Lokesh: ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పిస్తాం: మంత్రి లోకేష్
Irrigation: ఆఖరి ఎకరం వరకు నీరు అందిస్తాం: మంత్రి నిమ్మల
AP Cabinet: మళ్లీ పేపర్ లెస్ విధానం.. ఏపీ కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
YSRCP: ఏపీలో వైసీపీకి వరుస షాకులు.. నేతల రాజీనామాల పర్వం
Varudhu Kalyani: హోంమంత్రి అనితపై వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు