Delhi Temperature: దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీ నిప్పుల కొలిమిని తలపించింది. ఢిల్లీలోని ముంగేష్ పూర్ లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. నజాఫ్ గఢ్, పీఠంపురంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ లోని ఫలోడి లో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు చుక్కెదురు
మధ్యంతర బెయిల్ మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ తెలిపింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచన చేసింది.
లోక్ సభ ఎన్నికలపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఇండియా కూటమికి 300, ఎన్డీఏకి 200 సీట్లు వస్తాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ టీవీ చానల్‌లో డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. వైట్ పేపర్ పై రాసిచ్చారు. మరోవైపు తమకు 400 సీట్లు దాటుతాయంటూ ఎన్డీఏ చెబుతుండటం గమనార్హం.
Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. దేశాధినేతల దిగ్భ్రాంతి
PM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్