NKR 21: దివంగత సీనియర్ ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కొత్త చిత్రం 21వ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. కల్యాణ్ రామ్ ఇటీవల బింబిసార (Bimbisara), డెవిల్ (Devil) సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవైపున కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపున నిర్మాతగానూ కల్యాణ్ రామ్ బిజీగా ఉన్నారు.
వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ సహాయ సహకారాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో నిలదొక్కుకుంటున్నాడు కల్యాణ్ రామ్. గత ఏడాది దసరా సమయంలో కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాను సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కల్యాణ్ రామ్ 21వ చిత్రంలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanthi) సైతం కీలకర పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇవాళ ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్ర బృందం.
నేడు అన్న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే వార్త వచ్చింది. ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసి షూట్ శరవేగంగా జరుగుతోందంటూ చిత్ర బృందం ప్రకటన చేసింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ గ్లింప్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతోందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ చక్కర్లు కొట్టేలా చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కల్యాణ్ రామ్ ఉవ్విళ్లూరుతున్నారు.
Read Also: NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్!
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..