Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కావడంతో మేకర్స్ దీనిపై అదిరిపోయే అప్‌డేట్‌ను ప్రేక్షకులకు అందించారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. మే 19న ఫియర్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఎక్స్ ద్వారా తెలిపింది.
దేవర అప్‌డేట్‌తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్‌తోనే ఇంట్రస్టింగ్ అనిపించేలా చేశారు. ఎన్టీఆర్ బర్త్‌డే కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ విడుదల చేయనున్నారు. దీంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూసేలా చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు తన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రజనీకాంత్ జైలర్ మూవీకి కూడా ఈయనే మ్యూజిక్ అందించారు.
ఇవీ చదవండి: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ వీడియో వైరల్.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
[…] […]